మనకి తెలిసినంత వరకు ప్లేట్ ఇడ్లీ ధర రూ. 30 ఉంటుంది. అయితే హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు డబ్బు జబ్బు పట్టుకుంది. కరోనా మహమ్మారితో ప్రజలు ఆందోళన చెందుతుంటే ఆ ముసుగులో ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీ ఉన్నా పట్టించుకోకుండా కరోనా చికిత్సకు రూ. లక్షల్లో దండుకుంటున్నాయి.