అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ నిందితుడు జడ్జికే ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి ఇటీవల దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. అధికారులు అతడిని జూమ్ కాల్ ద్వారా తబితా బ్లాక్మాన్ అనే మహిళా జడ్జి ముందు హాజరుపరిచారు.