ఏపీలో గత కొద్దీరోజుల నుండి క్షుద్రపూజల ఘటనలు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి ఘటన మరవక ముందే ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు గ్రామం సమీపంలోని తుంగభద్ర హైలెవల్ కాలువలో స్థానికులు గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. అయితే కాలువ గట్టుపై దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు.