వధువు ఆఖరి క్షణంలో మరో ప్రియుడితో వెళ్ళిపోవడంతో బంధువులు, స్నేహితులు నిశ్చేష్టులయ్యారు. చెన్నై నగరంలోని నుంగంబాక్కంకు చెందిన 23 యేళ్ళ పెరియమ్మాళ్ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది.అదే సంస్థలో పనిచేస్తున్న నెమిలిచేరికి చెందిన సెంథిల్ కుమార్తో ప్రేమ వ్యవహారం నడిపింది. దీంతో వీరి ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వివాహానికి ప్లాన్ చేశారు. కళ్యాణ మండపం బుక్ చేశారు. సాయంత్రం పెళ్లి కావడం తో బందువులు హడావిడి మాములుగా లేదు. ఉదయం 5 గంటలకే ముహూర్తం. అందరూ నిద్రించే సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు వధువు వేరొక యువకుడితో పారిపోయింది..