చాలా మంది ప్రజలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత జీవన పరిణామాలకు తగ్గట్లుగా ప్రజలు ఉద్యోగం, డబ్బు సంపాదన వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో వీరు కంటి నిండా కునుకు కూడా వేయలేకపోతున్నారు. మనిషి సామాన్యం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. కానీ కొందరు తక్కువగా నిద్రపోతున్నారు. మరికొందరూ ఎలాంటి ఉద్యోగం, వ్యాయామం చేయకుండా అతిగా నిద్ర పోతుంటారు.