చాల మంది చేపలు పట్టడానికి నదులకు, సముద్రాలకు వెళ్తుంటారు. ఇక చేపలు పట్టడానికి చేపలు పట్టడానికి నదిలోకి వెళ్లిన వ్యక్తిపై ఒక మొసలి దాడిచేసి చంపేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆ దేశంలోని క్వీన్స్‌లాండ్‌లో 69 ఏళ్ల ఆండ్రూ హియర్డ్ అనే జాలరి గత వారం కనిపించకుండా పోయాడు. హించిన్ బ్రూక్ అనే ఐలాండ్ వద్ద బాధితుడు చేపల వేటకు వెళ్లాడు.