నేటి సమాజంలో మనుషుల్లో మానవత్వం అనేది కరువైపోతుంది. సాటి మనిషికి అండగా నిలబడాల్సింది పోయి వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సాలురుకి చెందిన వృద్ధుడు దాసరి పైడయ్య అతడి భార్య పార్వతీపురం నుంచి బస్సులో సాలూరుకు వెళ్తున్నారు. అయితే మార్గం మధ్యలో బస్సులో ఉండగానే వృద్ధుడు మృతి చెందాడు. భర్త అపాస్మారక స్థితిలో పడిపోవడం చూసి ఆ వృద్ధమహిళ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.