డ్రగ్స్ కేసులో పట్టుబడిన బీజేపి మహిళ నేత తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ యూత్ వింగ్ లీడర్ పమేలా గోస్వామి, ఆ పార్టీ సీనియర్ నేత రాకేశ్ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అందుకు ఒప్పు కోకపోవడంతో తనపై ఇలా కుట్ర పన్ని తనను ఇరికించారని ఆరోపించారు. నిజం ఎక్కువ రోజులు దాగదని, తాను చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.