తిరుపతి నగరపాలిక ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అధికార పార్టీ నేతలు శనివారం రాత్రే ప్రలోభాలకు తెరదీశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. నగరపాలిక పరిధిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద తెదేపా నాయకుడిపై దాడికి పాల్పడటంతో వివరాలు ఆరా తీసిన తెదేపా నాయకత్వం నగదు పంపకాన్ని గుర్తించి దానిని ఎక్కడ బయటపెడతాడో అన్న సందేహంతోనే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. తిరుపతి నగరపాలిక సంస్థ పరిధిలో ఆదివారం 27 వార్డుల్లో పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం సాగింది. వందలాది మందితో ర్యాలీలు నిర్వహించారు. వైకాపా, తెదేపా, భాజపా, జనసేన, సీపీఐ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం భారీగా చేశారు.