నేటి సమాజంలో సోషల్ మీడియాను వాడని వారంటూ ఎవరు లేరు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వాడుతూనే ఉన్నారు. ఫేస్ బుక్ కొత్త కొత్త వాళ్లతో స్నేహాలను పెంచుకుంటున్నారు. ఇక కుర్రాళ్లయితే ఎవరో తెలియని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే చాలు, ఆగమేఘాల మీద ఆవురావురుమంటూ యాక్సెప్ట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి చేష్టలకు పోయే ఓ హైదరాబాద్ కుర్రాడు చిక్కుల్లో పడ్డాడు.