కర్ణాటక పోలీసులు ఇప్పుడు అరక్షణం కూడా ఖాళీగా లేకుండా పనిచేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఘటన మంత్రి రాసలీలలు సీడి. అతని పై కేసు పైల్ అయిన నాటి నుంచి నేటి వరకు ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది.ఆ సీడీలోని యువతి రికార్డు వీడియోను విడుదల చేసింది. 'ఇప్పటికే సమాజంలో నా పరువు పోయింది. రక్షణ కల్పించండి. నా తల్లిదండ్రులు, నేను పలుమార్లు ఆత్మహత్యకు యత్నించాం అంటూ హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మైకు ఆమె వీడియోలో విన్నవించుకుంది. ఉద్యోగం కోసమే రమేశ్ జార్కిహొళిని కలిశానని తెలిపింది. అప్రమత్తమైన సిట్ అధికారులు దర్యాప్తునకు హాజరుకావాలని ఆమెను కోరారు..