బెజవాడ రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న యువ నేత, వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్.. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన మరింత దూకుడు పెంచారు. గత ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా పరిస్థితులు తనకు వ్యతిరేకంగా రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.