గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ గెలుపు ఊహించిందే అయినా జీరో నుంచి 100కు పైగా స్థానాలు గెలుచుకునే పరిస్థితి మాత్రం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. మొన్నటికి మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇంత విజయం మాత్రం ఆయన కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఎంఐఎంతో పొత్తుకు ఓ ఛాన్స్ అట్టి పెట్టుకున్నారు.

కానీ ఫలితాలు చూస్తే కారు మహా జోరుగా దూసుకపోయింది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఒక్క పాత బస్తీ మినహా అన్నిఏరియాల్లోనూ దుమ్మురేపేసింది. విచిత్రంగా నిన్న మొన్నటి వరకూ తెలుగునేలపై అతి పెద్ద పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ చిన్నబోయాయి. సింగిల్ డిజిట్ కు పరిమితం అయ్యాయి. 

టీఆర్ఎస్ తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది కేవలం ఎం ఐ ఎం మాత్రమే.. ఈ ఫలితాలతో జీహెచ్ఎంసీలో సీన్ పూర్తిగా మారిపోయింది. గతంలో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్, సైకిల్ ఎన్నోసార్లు కైవసం చేసున్నాయి. తొలిసారిగా మేయర్ పీఠాన్నిగులాబీ పార్టీ దక్కించుకోబోతోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి కూడా సాహసించని టీఆర్ఎస్ ఇప్పుడు 90కు పైగా స్థానాలు గెలుచుకుని గులాబీలు విరబూసింది. 

చివరకు పాతబస్తీలోనూ కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. సెటిలర్లు, బస్తీలు, హైక్లాస్ ఏరియాలు, ఓ మోస్తలు కాలనీ..అన్ని రకాల వర్గాలనూ కారు ఆకట్టుకుంది. మొట్టమొదటిసారి బల్దియా పీఠం దక్కించుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: