అటు గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు తోడు ఇంద్రావతి, సీలేరు, శబరి ఉపనదుల నుంచి వస్తున్న వరదతో గోదావరిలో ప్రవాహం పెరిగింది. అయితే తెలంగాణలో ఎగువనున్న సింగూరు, నిజాం సాగర్, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులకు నామమాత్ర ప్రవాహం కూడా ప్రాణహిత ద్వారా 12,000 క్యూసెక్కుల నీరు గోదావరిలో కలుస్తుండటంతో కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులలో గోదావరి నీటి మట్టం పెరిగింది.

కడెం ప్రాజెక్టు కు 23,000 క్యూసెక్యుల నీటి ప్రవాహం ఉంది. 700 అడుగులకు కడెం ప్రాజెక్టు లో 690 అడుగుల నీటి మట్టం నమోదైంది. కాళేశ్వరం నుంచి సుందిళ్ల పంప్ హౌజ్ లోకి నదీ జలాలు చేరుతున్నాయి. కన్నెపల్లిలో 4 పంపులు, అన్నారంలో 3 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 4.58 టీఎంసీల నీరు చేరింది. సుందిళ్ల మోటార్లు ఆన్ చేస్తే గోదావరి జలాలు ఎల్లంపల్లికి ప్రవహిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎర్రనీరు ఉరకలెత్తుతుంది.


ప్రస్తుతం గోదావరి వద్ద నీటి మట్టం 25 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో 15 గేట్లు ఎత్తివేసి 38,115 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరిలో ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 8.85 టిఎమ్ మీటర్ ల నీరు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో 10 మీటర్ లకు చేరుకోవచ్చని సీడబ్ల్యూసీ ఇంజనీర్ లు అంచనా వేస్తున్నారు.



వరద నీరు పెరగడంతో ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ ల రక్షణకు బౌల్టర్ లు వాల్స్ వేశారు. కొత్తూరు వాజ్ వైవిఎకి 6 అడుగుల మేర నీరు చేరింది. దీంతో ఎగువనున్న 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్వాసిత గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తుతుందన్న  భయాందోళనలో స్థానికులు ఉన్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద 9.30 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో 175 గేట్లను కొద్దిమేర ఎత్తి దిగువకు 70,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. దవళేశ్వరంలో ఈ సాయంత్రానికి ప్రవాహం ఉధృత మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: