టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రతిరోజూ విమర్శలు సంధిస్తున్నారు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఏదైనా జగన్ తీరును, పాలనను విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షనేత చేయాల్సిన పని కూడా అదే.. కానీ ఆ పని చేసే మందు అందుకు చంద్రబాబు ఎంత వరకూ నైతిక అర్హత ఉందో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.


ఎందుకంటే.. జన్మభూమి కమిటీలని పెట్టి రేషన్ కార్డు కావాలంటే లంచం, ఫించన్ కావాలంటే లంచం.. ఇళ్ల పట్టాలకు, మరుగుదొడ్లకు, భీమాకు కూడా లంచాలు వసూలు చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదేనని జనం చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో నేతలు ఇసుక, మట్టి కూడా అమ్ముకున్నారని.. జనాగ్రహం మొన్నటి ఎన్నికల్లో వ్యక్తమైంది.


తన హాయంలో జన్మభూమి కమిటీలతో అరాచకాలకు పచ్చజెండా ఊపిన చంద్రబాబు ఇప్పుడు గ్రామ సచివాలయాలను విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు జన్మభూమి కమిటీల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? ఇప్పుడు గ్రామ సచివాలయాల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది.. ఈ అసలు పోల్చి చూస్తే విషయం ఎవరికైనా బోధపడుతోంది.


ప్రజలకు నేరుగా సేవలు అందించే కార్యక్రమం జరుగుతుంటే పల్లె ప్రజలకు, పల్లెల్లోనే వారి గుమ్మం వద్దే అన్ని కార్యక్రమాలు అందుతుంటే ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ఎందుకు విమర్శిస్తున్నారన్నది అర్థంకాని విషయం. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సంబరాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు జగన్ పై సీబీఐ వ్యాఖ్యలను ప్రస్తావించడం చూస్తే అంతకు మించి విమర్శించేందుకు ఇంకా ఏమీలేదని అర్థమైపోతోంది.


ప్రతిపక్షం విమర్శించడానికే .. ఓకే కాదనరు.. కానీ.. గత నాలుగు నెలలుగా ఈ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనినైనా టీడీపీ కనీస మాత్రం మెచ్చుకుందా.. కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులు ఇస్తుంటే ఆ బిల్లులకైనా మీరు మద్ధతిచ్చారా అంటే అదీ లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు విమర్శలను జనం పట్టించుకోవడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: