ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొన్ని రోజుల ఇసుక వ్యవహారం రగడ సృష్టిస్తోంది. ఇసుక కొరత కారణంగా దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది.  దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  నిర్మాణ రంగం కుంటుపడింది.  నిర్మాణాలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  రాష్ట్రంలో మొత్తం 275 ఇసుక రిచ్ లు ఉంటె అందులో ఇప్పుడు 61 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి.  వీటిని 83 కు పెంచారు.  ఈ 83 ఇసుక రిచ్ ల నుంచి ఇసుకను తీస్తున్నారు.  


రోజుకు సగటున 41వేల టన్నుల ఇసుకను తీస్తున్నారు.  మరోవారం రోజుల్లో లక్ష టన్నులకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వాతావరణం అనుకూలిస్తే.. పదిహేను రోజుల్లోనే అన్ని ఇసుక రిచ్ ల నుంచి ఇసుకను తీసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.  ఇక ఇసుకలో అక్రమాలు చోటు చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.  ఇసుక తవ్వకాల్లో అవతకతవకలు జరగకూడదని ప్రభుత్వం తెలిపింది.  


ఇదిలా ఉంటె, రాష్ట్రంలో ఇసుక బంగారంగా మిన్నగా మారిపోయింది.  రాష్ట్రంలో ప్రతీరోజు సగటున 60 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుండగా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆన్‌లైన్‌ విధానంలో విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో టన్ను ఇసుక ధర రూ.600 కాగా, రవాణా, ఇతర చార్జీలు కలుపుకుని లారీ యజమానులు, దళారులు సాధారణ రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,400 వరకు విక్రయిస్తున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో నదీగర్భం నుంచి ఇసుక తీసేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో... బహిరంగ మార్కెట్లో దళారులు టన్ను ఇసుకను రూ.3 వేలకు పైగా విక్రయిస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు.

చిన్న చిన్న నిర్మాణాలు ఆగిపోతున్నాయి.  వ్యయం భారీగా పెరిగిపోయింది.  దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.  ఎక్కడైనా అభివృద్ధి అంటే నిర్మాణ రంగం సంక్రమంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది.  లేదంటే ఇబ్బందులు పడాల్సిందే.  ఇప్పుడు మరోవైపు రాష్ట్రాన్ని బుల్ బుల్ తుఫాన్ ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది.  ఈ తుఫాన్ ధాటికి రాష్ట్రం విలవిల్లాడిపోయేలా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: