ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. రేపటి నుండి ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కావాలని అశ్వత్థామరెడ్డి సూచించారు. ఇది కార్మికుల నైతిక విజయం అని అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రైవేట్ కార్మికులు విధుల నుండి వెళ్లిపోవాలని అశ్వత్థామరెడ్డి సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె విరమిస్తున్నట్లు అశ్వత్థామరెడ్డి ప్రకటన చేశారు. 
 
విధుల్లో చేరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొనివస్తామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయటానికి ప్రయత్నాలు చేస్తోందని ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి ప్రభుత్వం స్పందించినా, స్పందించకపోయినా కార్మికులందరూ డిపోలకు వెళ్లి విధులను నిర్వహించాలని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొనిరావాల్సి ఉందని అన్నారు. ప్రజా కోణంలో, ఆర్టీసీ కోణంలో ఆర్టీసీ ఆస్తులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అశ్వత్థామరెడ్డి అన్నారు. 
 
ప్రైవేట్ కార్మికులు రేపటి నుండి విధులకు హాజరు కాకుండా ఆర్టీసీ కార్మికులకు విధులు నిర్వహించుకునే పరిస్థితి కల్పించాలని ప్రకటించారు. ఈ 50 రోజుల పోరాటం ఆర్టీసీని బ్రతికించుకోవటానికి, కార్మికుల డిమాండ్లను పరిష్కరించుకోవటానికి నాంది పలుకుతుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీలో తీసుకొచ్చే జీవో చెల్లదని అశ్వత్థామరెడ్డి అన్నారు. మరి ఆర్టీసీ కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 
 
భవిష్యత్తులో చనిపోయిన అమరవీరుల కుటుంబానికి జేఏసీ తరపున సాయం చేస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు ప్రభుత్వం గెలవలేదని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కొద్ది రోజుల క్రితమే కార్మికులు సమ్మె విరమిస్తామని ప్రకటించినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదు. మరోవైపు సీఎం కేసీఆర్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేసీఆర్ ఆర్టీసీ సమ్మె, ప్రైవేటీకరణ, కొత్త రెవిన్యూ చట్టం గురించి చర్చిస్తున్నారని సమాచారం. భేటీ అనంతరం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: