గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.తెరాస  మండలి విప్ కర్నె ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మతిస్థిమితం కోల్పోయి తప్పుడుమాటలు మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. మన  దేశానికి, ప్రజలకు అవసరం అవుతుందని  భావించిన ప్రతిబిల్లుకూ పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని,ప్రజల అభివృద్ధికి ఆటంకం కలింగించే బిల్లుల్ని మాత్రమే  వ్యతిరేకించామని అయన వ్యాఖ్యానించారు .

 

బీజేపీవి మతతత్వ రాజకీయాల్లో చేస్తోంది అని , బీజేపీది  మతోన్మాదం అని .. సీఎం కేసీఆర్ ది మానవత్వమని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే గొడ్డవలకు దారితీసే విదంగా ఉన్నాయ్ అంటూ   బీజేపీ విధానాలను ఎండగట్టి తీరుతామని అయన మాట్లాడారు మేము పౌరసత్వ సవరణ బిల్లుకు (సీఏఏ) టీఆర్‌ఎస్ పూర్తిగా విరుద్ధం  కాదని, అందులోని వివాదాస్పద అంశాలనే మాత్రమే వ్యతిరేకిస్తున్నామని..దీనికే టీఆర్‌ఎస్‌ను పాకిస్థాన్ ముస్లింలంటూనిందలు వేయడం సరికాదుఅని  బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

పాకిస్థాన్ అంత దుర్మార్గ దేశమైతే ప్రదాని మోదీ గతంలో పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను ఎందుకుకలిసినట్టు అని ఎద్దేవా చేసారు . నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్థిక మాంద్యం వంటి ఒడిదొడుకులు వచ్చిన ప్రతిసారీ  తమను తాము కాపుడుకోవడానికి మతపరమైన వివాదస్పద అంశాలను తెరపైకితెచ్చి ఆ రాజకీయ మంటలలో చలికాచుకోవడం బీజేపీకి మాములు అయిపోయింది అని యెద్దవా చేసారు .

 

 

.గతంలో కూడా  గుజరాత్, మీరట్, హైదరాబాద్‌లో జరిగిన  మతఘర్షణలు బీజేపీ భాగస్వామ్యం, ప్రోద్బలంతోనే జరిగాయని ప్రజలు అనుకుంటున్నారని  ఆరోపించారు. ఆరేండ్లుగా హైదరాబాద్‌లో  ఎటువంటి మతఘర్షణలు తావులేదు ఎటువంటి విద్వేషాలు రేగడం లేదు అని భావనతో  బీజేపీ నాయకులు, ప్రజల మధ్య మతచిచ్చు పెట్టేకుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలను మతం పేరిట గొడవలుపెట్టి  రాజకీయపబ్బం గడుపుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యని పేర్కొన్నారు. బీజేపీకి అభివృద్ధి పట్టదు. ప్రజాసంక్షేమం గిట్టదు. లౌకికవాదానికి తిలోదకాలిచ్చింది. అని అయన పేర్కొన్నారు ,

మరింత సమాచారం తెలుసుకోండి: