రాజధానిని విశాఖపట్నంకు తరలింపుకు జగన్మోహన్ రెడ్డి తేదీ నుండి నిర్ణయించారా ? అవుననే చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. అమరావతి నుండి విశాఖపట్నానికి సచివాలయం తరలింపును ఏప్రిల్ 6వ తేదీలోగా పూర్తవ్వాలని ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ముఖ్యుల నుండి కీలక ఆదేశాలు అందినట్లు సమాచారం. రానున్న ఉగాది అంటే మార్చి 25వ తేదీలోగా విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు కావాలని సిఎం గట్టిగా డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే మౌఖిక ఆదేశాలు వెలువడిన నేపధ్యంలో వచ్చే నెలలో తరలింపుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రిలీజవుతాయని సమాచారం. అంటే జరుగుతున్నది చూస్తుంటే విశాఖపట్నానికి రాజధాని తరలి వెళ్ళిపోవటం ఖాయమని అర్ధమైపోతోంది. అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలంటూ జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కువ భాగం పెయిడ్ ఆందోళనలే అని ఇప్పటికే ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది.
నిజానికి రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన చంద్రబాబునాయుడు బినామీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, టిడిపి కీలక నేతలు చేయిస్తున్న గోల ఎక్కువగా జరుగుతోందనే ఆరోపణలు విస్తృతంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సరే ఎవరెంతగా గోల చేస్తున్నా రాజధాని తరలివెళ్ళిపోవటమైతే ఖాయమే అని తేలిపోయింది.
ఇందులో భాగంగానే విశాఖపట్నంలోని మిలీనియం ఫేజ్-2, ఫేజ్-2 లో భారీ భవనాలున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఫేజ్-1 లో 8 అంతస్తుల అధునాతన సౌకర్యాలతో నిర్మించిన భవనాలు ఉన్నాయి. కాబట్టి వీటిల్లో ఏది సెట్ అవుతుందని అనుకుంటే అందులో జగన్ సచివాలయం ఏర్పాటు చేసుకుంటారు.
అలాగే విశాఖ నగరానికి ఆనుకునే ఉన్న సబ్బవరం, కాపులుప్పాడ ప్రాంతాల్లో కూడా వందల ఎకరాల ఖాళీ స్ధలాలతో పాటు భారీ భవనాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వీటిల్లోకి వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు మారిపోవటానికి కావాల్సినంత స్పేస్ రెడీగా ఉంది. అంటే అన్నీ సౌకర్యాలు, పరిస్ధితులను నిర్ధారణ చేసుకున్న తర్వాతే విశాఖపట్నాన్ని రాజధానిగా జగన్ ప్రకటించిన విషయం అర్ధమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి