ప్రపంచం ఎటువైపు పోతుందో, ఎలా అడ్డదారుల్లో పయనిస్తుందో చెప్పడానికి  ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.  ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ విచ్చలవిడిగా నాశనం చేస్తూ ఉంటె, ప్రక్రుతి చూస్తూ ఊరుకోదు.  ఎప్పుడో ఒకప్పుడు తగిన శాస్తి చేస్తుంది.  ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించింది.  ఇప్పటికే బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల్లో రగిలిన కార్చిచ్చు కారణంగా లక్షలాది మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి.  వేసవికాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు సహజమే.  


కానీ, ఈ అగ్నిప్రమాదాలు  ఈ స్థాయిలో ఉంటాయని అనుకోవడం లేదు.  అమెజాన్ అడవుల్లో జరిగిన ఘోరం ఎప్పటికి మర్చిపోలేరు.  తరువాత అమెరికాలోని క్యాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రగులుకుంది.  దీని వలన ఎలాంటి ఘోరాలు జరిగాయో చెప్పక్కర్లేదు.  ఈ ఘోరం కారణంగా వేలాది జంతువులు మరణించాయి.  ఇల్లు తగలబడ్డాయి. ఎలాగోలా అగ్ని శాంతించింది.

 
ఇప్పుడు ఇదే అగ్ని ఆస్ట్రేలియాను చుట్టుముట్టింది.  అసలే ఎండాకాలం.. పైగా వేగంగా వీస్తున్న గాలులు... దీంతో అడిలైడ్ ప్రాంతంలోని అడవుల్లో అగ్ని అంటుకుంది.  క్షణాల్లోనే అగ్నికి ఆహుతి అవుతున్నాయి అడవులు.  ఈ అడవుల్లోని 50 కోట్ల జీవరాసులు అగ్నికి బలైనట్టు తెలుస్తోంది.  ప్రాంతాల్లోని దృశ్యాలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉంటున్నాయి.  ఫెన్సింగ్ దాటి రాలేక ఎన్నో ప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి.  


ఇకపోతే, ఎడారి ప్రాంతం, పైగా ఎండాకాలం కావడంతో అక్కడి ప్రజలు నీళ్లకు ఇబ్బందులు పడుతున్నారు.  అయితే, ఎడారిలో తిరిగే ఒంటెలు నీళ్లకోసం  పట్టణాల్లోకి వస్తున్నాయి.  ఉన్న నీళ్లకు తాగేస్తున్నాయి.  దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రజలు నీళ్లకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అక్కడి ప్రభుత్వం ఒంటెలను చంపాలని చూస్తున్నది.  రాబోయే ఐదు రోజుల్లో 10వేల ఒంటెలను చంపేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  ప్రజలకు నీళ్లు దొరక్కపోతే బయట నుంచి తెప్పించుకోవాలిగాని ఇలా ఒంటెలను చంపడం మహానేరం.  పైగా ఒంటెల నుంచే వచ్చే వ్యర్ధ పదార్ధాల్లో మీథేన్ వాయువులు ఉంటున్నాయని, దాని వలన కూడా అడవులలో మంటలు చెలరేగుతాయని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: