చంద్రబాబునాయుడు కత క్లైమ్యాక్స్ కు చేరుకున్నట్లే అనుమానంగా ఉంది. 70 ఏళ్ళ వయస్సులో ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు చేస్తున్న చేష్టలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. దాంతో అందరికీ మానసిక పరిస్ధితిపై  అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఐదేళ్ళ పరిపాలనలో రాష్ట్రాన్ని అన్నీ విధాలుగాను మాజీ సిఎం  గబ్బు పట్టించేసిన విషయం అందరికీ తెలిసిందే. చివరకు రాజధాని విషయంలో కూడా రైతులతో పాటు రాష్ట్రం జనాలందరినీ మాయ చేశారు.

 

ఐదేళ్ళ విలువైన కాలాన్ని గ్రాఫిక్స్ తో మోసం చేసిన  చంద్రబాబు ఇపుడు కూడా అదే బాటలో నడుస్తున్నారు. కాకపోతే ఆయనకున్న ఎల్లోమీడియా దన్నుతో  పెద్ద ఎత్తున డ్రామాలాడుతున్నారు.  నిజానికి ఈ వయస్సులో రోడ్డున పడాల్సొస్తుందని  చంద్రబాబు ఏమాత్రం ఊహించుండరు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిపోయిందనే చెప్పాలి.

 

ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ ను ఇబ్బంది పెడదామని చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. ఈ నేపధ్యంలో మూడు రాజధానులంటూ జగన్ చేసిన ప్రతిపాదనను అవకాశంగా తీసుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. అందుకనే ఎల్లోమీడియా దన్నుతో నానా రాచ్చ చేస్తున్నారు. గడచిన 26 రోజులుగా అమరావతి గ్రామాల్లో ఎంతగా యాగీ చేస్తున్నదీ అందరూ చూస్తున్నారు. అది చాలదన్నట్లు ఇపుడు  జోలె పట్టుకుని రాష్ట్రం మీద పడటమే విచిత్రంగా ఉంది.

 

చంద్రబాబు డ్రామాలాడుతున్నట్లు స్పష్టంగా అందరికీ తెలిసిపోంది. రాజధాని ప్రాంతంలో తాను, తన బినామీలు, టిడిపిలోని ప్రముఖులు కొన్న భూముల గురించి కావచ్చు లేదా  పుత్రరత్నం నారా లోకేష్ భవిష్యత్తుపై బెంగతో కావచ్చు అదీ కాకపోతే తొందరలో జరగబోతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పుంజుకోవాలని కూడా కావచ్చు.  చంద్రబాబు ఎన్ని నాటకాలాడుతున్న జనాలైతే పెద్దగా పట్టించుకోవటం లేదు. అందుకనే  చంద్రబాబు చేస్తున్న విన్యాసాలను చూసిన తర్వాత చంద్రబాబు కత క్లైమ్యాక్స్ కు చేరుకున్నట్లే అర్ధమైపోతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: