ఒక దేశంలో జనాభా అత్యధికంగా ఉంది అంటేనే అక్కడ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ప్రపంచ దేశాల్లోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం మరియు చైనా సాంకేతికంగా మరియు ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా వారికి ఉండాల్సిన సమస్యలు వారికి ఉన్నాయి. ఇక మన సరిహద్దు ప్రాంతంలో ఉన్న చైనా అడ్డమైన వ్యాధులకు మరియు వైరస్ లకు కూడా వేదికగా మారుతోంది. తాజాగా ఒక సర్వేలో తేలింది ఏమిటంటే చైనా నుంచి అనేక వ్యాధులు ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి అని. ఇదేదో సెవెంత్ సెన్స్ సినిమా కథ లాగా ఉంది అని అనుకోకండి.

 

తాజాగా చైనాలో పుట్టిన ఒక కొత్త వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. కొరోనా అన్న పేరు ఉన్న వైరస్ ఊహించినదానికంటే అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతోంది. మొత్తం 45 లాబ్ ల్లో గుర్తించబడిన వింత వైరస్ ఇప్పటికే చైనాలోని వుహన్ సిటీలో దీనివల్ల ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1500 మందికి ఇది సోకినట్లు గుర్తించగా విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకుని వెళ్లడంతో లండన్లోని కొత్త వైరస్ పై పరిశోధన చేసే కళాశాల కు శాంపిల్స్ పంపించగా అది మధ్య పుట్టిన వైరస్ అని వారు కనుగొన్నారు.

 

కొరోనా అంటే క్రౌన్ (కిరీటం) అని అర్థం. వైరస్‌ని మైక్రోస్కోప్‌లో చూసినప్పుడుకిరీటం ఆకారంలో ఉండటంతో పేరు పెట్టారు పరిశోధకులు. దీనితో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసారు. అమెరికా, సింగపూర్, హాంకాంగ్ ఇలా చాలా దేశాల్లో విమానాశ్రయాల్లో హెల్త్ చెకప్స్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత్ కి సోకే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొరోనా వైరస్ సోకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. తర్వాత సరిగా ఊపిరాడదట.

మరింత సమాచారం తెలుసుకోండి: