రాజధాని అంటే.. రాష్ట్రానికి గుండె కాయ. అలాంటి గుండె కాయ తమ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంత వాసుల ఆనందానికి అవధులు ఉండవు. రాజధాని వస్తే.. తమ ప్రాంతం అభివృద్ధి అవుతుందని అంతా ఆశిస్తారు. తమ ప్రాంతానికి అంత మహద్భాగ్యం కలిగించిన నాయకుడి ఎన్ని జన్మలెత్తినా తాము రుణం తీర్చుకోలేమని భావిస్తారు. మరి అలాంటి అవకాశం ఇచ్చిన నాయకుడికి ఆ ప్రాంతంలోనే ఛీత్కారం ఎదురైతే.. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

 

2019 ఎన్నికల్లో అదే జరిగింది. రాజ‌ధాని 29 గ్రామాలు ఉన్న మంగ‌ళ‌గిరిలో బాబోరు కొడుకు లోకేష్ స్వయంగా ఓడాడు...టీడీపీ కంచుకోట తాడికొండ‌లో కూడా పార్టీ ఓడిపోయింది. ఇలా ఎందుకు జరిగింది. అసలు టీడీపీ సిట్టింగ్ స్థానం కూడా ఎందుకు కోల్పోయింది. ఏకంగా సీఎం కొడుకునే జనం ఎందుకు ఓడించారు. అంగబలం, అర్థబలం అన్నీ మోహరించినా చంద్రబాబు ఎందుకు కొడుకును గెలిపించుకోలేకపోయారు.

 

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే.. అదే భ్రమరావతి. రాజధానిగా తమ ప్రాంతం ఎంపికతో ఈ ప్రాంతం జనం ముందుగా ఆనందపడ్డారు. తమ రాత మారిపోతుందని భావించారు. కానీ అదంతా వాస్తవం రూపంలోకి రాకపోవడంతో వారు నిరాశ చెందారు. రోమ్ నగరం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదన్నది నిజం. కానీ చంద్రబాబు సర్కారు ఐదేళ్ల సమయం ఉన్నా.. రాజధాని నిర్మాణం విషయంలో గ్రాఫిక్స్ తోనే మాయ చేసింది.

 

భ్రమలను కల్పించి భ్రమరావతిగానే ఆ ప్రాంతాన్ని మిగిల్చింది. అందుకే ఆ ప్రాంత ప్రజలు రాజధానిని తమకు ఇచ్చిన టీడీపీనే చిత్తుగా ఓడించారు. రాజధాని ప్రాంతంలో జనం ఇచ్చిన తీర్పే చంద్రబాబు అమరావతి విషయంలో చేసిన ఘోరమైన తప్పిదాలకు, ఆశ్రిత పక్షపాతానికి, సామాజిక వర్గ పక్షపాతానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అమరావతి ని భ్రమరావతి గా మిగల్చడం వల్లే మొన్నటి ఎన్నికల్లో రాజధాని ప్రాంత ప్రజలు చంద్రబాబును ఛీకొట్టారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: