ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు కేబినెట్ సమావేశంలో శాసన మండలి రద్దు చేసే దిశగా కీలకమైన అడుగు వేసిన నేపథ్యంలో.. ఇక చంద్రబాబు భవిష్యత్తు ఏమిటి అంతా తెగ ఆలోచిస్తున్నారు. రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లును ఒక నాలుగు రోజులు ఆపేసి ఏదో సాధించినట్లు చంకలు గుద్దుకున్న బాబుకి చివరికి తను తవ్వుకొన్న గోతిలో తనే పడినట్టుగా అయింది. మరొక రెండేళ్లలో మండలిలో వైయస్ఆర్సీపీ నాయకులే కూర్చునే అవకాశం ఉన్నా కూడా దానిని జగన్ ఎంపిక చేసుకోకుండా మండలి రద్దుకే అతను మొగ్గు చూపడంతో అతనిలో ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం ఎంత లేకపోతే అలా చేస్తాడు అని అందరూ జగన్ ను అంతా కొనియాడుతున్నారు.

 

ఇకపోతే బాబు తన అడ్డాగా చెప్పుకునే శాసనమండలిలో కూడా చివరికి అతని పరువు పోవడం గమనార్హం. బాబు ఎంతోకాలంగా అంటిపెట్టుకున్న శాసనమండలి చివరికి అతని వల్లే పునాదులతో సహా లేచిపోయి నేలమట్టం అవుతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న బాబును చూసి చాలా మంది జాలి పడుతున్నారు. ఏదో చేయాలి ఎలాగైనా జగన్ ని ఆపాలి అని బాబు పడిన తపన చివరికి అతనికి శూన్యాన్ని మిగిల్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

ఇకపోతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోగా వారికి జరుగుతున్న దానిని కూడా తన కుట్రపూరిత ఆలోచనలతో ఆపివేసినందుకు ప్రయత్నించడం వల్ల అతనికి ప్రజల్లో కూడా బాగా పాపులారిటీ తగ్గిపోయింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చంద్రబాబు మూటాముల్లె సర్దుకుని రిటైర్ అయిపోవడం మంచిదని ఇక అతని పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయి అన్నది కూడా పలువురి మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: