పరిపాలన చేతగాక, పాలనకు అవసరమైన నిధుల్ని సమకూర్చుకోవడం చేతగాకే జగన్‌ మూడురాజధానులను తెరపైకి తెచ్చాడని వెంకట్రావు మండిపడ్డారు. చట్టబద్ధత లేని పనికిమాలిన కమిటీలతో ప్రజలమధ్యన చిచ్చుపెట్టాడన్నారు. బీసీజీకమిటీ వేసే ముందు దానికి రూ.6కోట్లు కేటాయించారని, ఆయాకమిటీలు  రిపోర్ట్‌ ఇవ్వముందే అసెంబ్లీలో జగన్‌ మూడురాజధానల ప్రకటనచేశాడని, ఆకమిటీలకు ఎలాంటిచట్టబద్ధత ఉందో, ప్రభుత్వం వాటికి ఎంతవిలువఇచ్చిందో ముఖ్యమంత్రి చర్యతోనే తేలిపోయింద న్నారు. హైదరాబాద్‌కు ధీటుగా ఎదుగుతుందనే దురుద్దేశంతో, అమరావతిని పూర్తిగా నాశనంచేసేందుకే ఇలాంటి తలాతోకలేని కమిటీలను  ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 

 


అమరావతి ప్రాంతం మునుగుతుందని బీసీజీ ఎలా చెప్పిందని, ఏరిపోర్టు ఆధారంగా   చెప్పిందో స్పష్టంచేయాలన్నారు. నేషనల్‌గ్రీన్‌ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి స్వతంత్రకుమార్‌  అమరావతి ఎట్టిపరిస్థితుల్లోనూ ముంపునకు గురికాదని చెప్పడం జరిగిందన్నారు.  అమరావతి నిర్మాణానికి రూ.లక్షకోట్లవుతుందని చెబుతున్నవారు, రాజధాని గురించి పూర్తిగా అవగాహనలేనివారేనన్నారు. ల్యాండ్‌పూలింగ్‌ద్వారా అమరావతినిర్మాణానికి ఇచ్చిన భూమిధర ఎంత, అన్నినిర్మాణాలు పోను ప్రభుత్వందగ్గర మిగిలేభూమి ఎంత అనేది తెలియనివారే రాజధానిభూములు, నిర్మాణఖర్చుపై దుష్ప్రచారం చేస్తున్నారని కళా వివరించారు. 

 

మార్చి2019లో మందడంలో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు పరిశీలిస్తే, గజం రూ.33వేలచొప్పున జరిగాయని, ఆలెక్కన రైతులిచ్చిన భూమిలో  నిర్మాణాలకుపోగా మిగిలిన 8 నుంచి 10వేల ఎకరాలను అమ్మగా వచ్చే ఆదాయమే సరిపోతుందని కళా పేర్కొన్నారు. భూములమ్మి రాజధాని ఎందుకు నిర్మించాలనుకునే వారికి, హైదరాబాద్‌పై వచ్చే 60శాతం ఆదాయమే సమాధానమని గ్రహించాలన్నారు.   పథకాలు అమలుచేయాలన్నా, ఉద్యోగఉపాధి అవకాశాలు సృష్టించాలన్నా, పరిశ్రమల ను ఆకర్షించాలన్నా నగరనిర్మాణమే ఉత్తమమార్గమన్నారు. అమరావతిలో చదరపు అడుగునిర్మాణానికి రూ.6వేలు ఖర్చయితే, విశాఖలో రూ.4వేలు ఖర్చవుతుందని కమిటీల్లో రాయించారని, రాఫ్ట్‌ఫౌండేషన్‌ద్వారా రూ.3వేలకే గతప్రభుత్వంభారీ నిర్మాణా లుచేసి చూపిందన్నారు. 

 

శ్రీభాగ్‌ ఒప్పందంలో కర్నూలుకి హైకోర్టు ఇవ్వాలని ఉంటే, బీసీజీ నివేదిక దాన్నికూడా తప్పుగా చూపిందని, మౌలికవసతుల కల్పనజరగలేదని చెప్పడం పెద్దతప్పన్నారు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల నివాసాలు,  రోడ్లనిర్మాణం వంటివి చూడకుండా ఆమాట ఎలా చెప్తారని మాజీమంత్రి నిగ్గదీశారు.   ఇప్పటికే అమరావతిలో రూ.9వేలకోట్ల నిర్మాణాలు జరిగాయని, కొత్తరాజధానిలో ఇవే నిర్మాణాలు చేయాలంటే అంతకు రెండింతలు ఖర్చవుతుందన్నారు. రూ.6కోట్లు ఇచ్చారుకాబట్టి, ముఖ్యమంత్రి చెప్పిందానికి మద్ధతుగా ఆయాకమిటీలు తమరాతలు రాసినట్టున్నాయని టీడీపీనేత ఎద్దేవాచేశారు. జీ.ఎన్‌.రావు, బీసీజీకమిటీ రిపోర్టులు పరిశీలిస్తే, వాటిలోని తప్పులతడకలేమిటో రాష్ట్రప్రజానీకానికి అర్థమవుతుందన్నారు.    విలేకరుల ముందుకొచ్చిన జీ.ఎన్‌.రావు తానుచెబుతున్నదానికి, కమిటీలో పేర్కొన్న దానికి ఎక్కడా పొంతనలేదన్నారు. కమిటీఛైర్మన్‌ఎవరో, మెంబర్‌ఎవరో తెలియనంత బాగా అందులోనిసభ్యులు, రాష్ట్రప్రభుత్వం పనిచేశాయన్నారు. తానిచ్చిన హామీల నుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికే జగన్‌, కమిటీలపేరుతో మూడురాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని కళావెంకట్రావు తేల్చిచెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: