ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో ఊహించని షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం ఎక్కువ వినిపిస్తుంది. అసలు 2019 ఎన్నికల తర్వాత నుంచి టీడీపీకి వరుస షాకులు తగులుతూనే వచ్చాయి. ఆ పార్టీ నేతలు వరుసగా బీజేపీ, వైసీపీల్లోకి జంప్ కొట్టేశారు. ఇక తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా షాక్ ఇచ్చి జగన్‌కు మద్ధతు తెలిపారు. అయితే వల్లభనేని వంశీ వైసీపీకి మద్ధతు తెలిపిన సమయంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బాబుకు షాక్ ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ అనుకున్న విధంగా బాబుకు షాకులు తగల్లేదు.

 

ఒక్కసారిగా మూడు రాజధానులు అంశం తెరపైకి రావడంతో, రాష్ట్ర రాజకీయాలు అటు వైపు తిరిగిపోయాయి. కాకపోతే మధ్యలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఒక్కరే టీడీపీని వీడారు. మిగతా వారి ఎవరు బయటకు రాలేదు. అయితే జగన్ వ్యూహంలో భాగంగానే ఇలా వన్ బై వన్ ఎమ్మెల్యేలు టీడీపీకి షాక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కు టచ్‌లో ఉన్నారని, త్వరలో వారు కూడా షాక్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

 

ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. చీరాలకు చెందిన కరణం బలరామ్, అద్దంకికి చెందిన గొట్టిపాటి రవికుమార్‌లతో వైసీపీ నేతలు ఇప్పటికే మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. వీరిలో కరణం కుమారుడుకు కీలక పదవి కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే వీరిలో వస్తే ఒక్కరే వైసీపీలోకి వస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ రెండు ఫ్యామిలీలకు ముందు నుండి పడదు కాబట్టి...ఒకరు వస్తే మరొకరు టీడీపీలోనే కొనసాగే అవకాశముందని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒక ఎమ్మెల్యే గోడ దూకే ఛాన్స్ ఉందని  వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: