చిత్తూరు సహకార విజయ డైరీ కి ఎంతో ఘన చరిత్ర ఉంది. దేశంలోనే అతిపెద్ద డైరీగా రెండో స్థానం దక్కించుకుంది. అలా ఈ డైరీ ప్రస్థానం సాగుతుండగానే అప్పట్లో అధికారంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ డైరీని ఉద్దేశపూర్వకంగా నష్టాలబాట పట్టించి మూసివేయించాడని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థకు పోటీగా విజయ డైరీ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే దీనిని మూయించివేసినట్టుగా అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ సంస్థ లో సుమారు 600 మంది కార్మికులు ఉండగా ..ఈ సంస్థ ద్వారా వేలాది మంది ప్రత్యక్షంగా... పరోక్షంగా లబ్ది పొందే వారు. ఈ ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని అనేక పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు. 


రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దీనిని తెరిపించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఇక ఆ తర్వాత వైసీపీ అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర నిర్వహించిన జగన్ దృష్టికి రైతులు, కార్మికులు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో తప్పక కార్మికులు, రైతులను ఆడుకుంటాను అంటూ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు ఈ డైరీని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేందుకు ముందుకు వస్తోంది. నిత్యం తిరుమలలో వేలాది లీటర్లు పాలు అవసరం అవుతున్నాయి. ఈ పాలను ప్రవేట్ డైరీలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రతి ఏటా ఇబ్బడి ముబ్బడిగా పాల ధరను పెంచుతూ వెళ్తుండడంతో టీటీడీపై అదనపు భారం పడుతోంది. దీంతో విజయ డైరీ ని సొంతంగా నిర్వహిస్తే అటు టిటిడికి అవసరమైన పాలను కూడా తక్కువ ధరకు పొందవచ్చు అనే ఆలోచనలో టిటిడి ఉంది.


 ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దీని నిర్వహణ లాభ నష్ఠాలపై అంచనా వేసేపనిలో టీటీడీ ఉంది. ఒకవేళ దీని నిర్వహణకు టీటీడీ ముందుకు వచ్చి దానిని నిర్వహిస్తే పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న అవుతుంది. కార్మికులు, రైతులకు న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రస్తుతం ఈ పరిణామాలపై అటు కార్మికులు, రైతులను ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: