ప్రేమ రెండు అక్షరాలు. కానీ దాని అనుభూతులు మారినో. ఎంతటి  గొప్పవారైన దీని ముందు దాసోహులు కావాల్సిందే. దీనికి చిన్న పెద్ద, ధనిక, పేద అంటూ తేడాలు లేవు. దీని ముందు అందరు సమానులే. ప్రేమ ఇద్దరిని ఉన్నవారిని ఒక్కటి చేస్తుంది. వారి దేహాలు వేరైన వారి ప్రాణం ఒక్కటే. ప్రేమ రెండు మనసులను ఒక్కటి చేస్తుంది. కన్న వారిని కూడా కాదనుకునేలా చేస్తుంది. ప్రేమించిన వారి కోసం అందరిని  చేసుకోవడానికి సైతం సిద్ద  పడుతుంది. అయిన వారిని కానివారిలా మార్చేస్తుంది. కానివారిని సొంత వారిలా దగ్గరికి చేస్తుంది. 

 

ప్రేమ  కోసం ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఆ ప్రేమ కోసం  ప్రాణాలను తీసిన వారు ఉన్నారు. కొంత మంది తల్లిదండ్రులు అర్ధం  చేసుకొని వారి పిల్లల ఇష్టాలకు గౌరవించి పిల్లలు ప్రేమకు విలువనిచ్చి పెళ్లిలు చేసినవారు ఉన్నారు. మరి కొంత మంది తల్లిదండ్రులు వారి కుటుంబ పరువు కోసం పాకులాడుతూ పిల్లలను హత్య చేసినవారు కూడా ఉన్నారు.పిల్ల ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు  తెలిసినప్పుడు వారికీ అర్ధమయ్యే విధంగా చెప్పండి. అంతే కానీ మరొక్కరి ప్రాణం తీసి వారి కుటుంబానికి అన్యాయం చేయకూడదు. నేటి సమాజంలో ప్రేమ వ్యవహారంలో పరువు హత్యలే ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి మరో ఘటన కోయంబత్తూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.  

 

కోయంబత్తూర్‌ జిల్లా కినత్తుకడవు సమీపంలోని కరుప్పరాయన్‌ ఆలయ వీధికి చెందిన దినేష్‌కుమార్‌ (22) తామరైకుళం కు చెందిన ఆటోడ్రైవర్‌ మణికంఠన్‌ (20) అక్కను ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న మణికంఠన్‌ అతడిని హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం ఏర్ప డింది. ఆవేశంగా మణికంఠన్‌ కత్తితో దినేష్‌ కుమార్‌పై దాడిచేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అక్క ప్రియుడిని హత్య చేసిన తమ్ముడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: