
ఈ మధ్య కాలంలో వివిధ కారణాలతో మనస్పర్థలతో భార్యాభర్తలిద్దరూ విడిపోతున్నారు. ఇక ఆ తర్వాత భార్య పుట్టింటికి పరిమితమవుతోంది..మళ్ళీ కాపురానికి మాత్రం రావడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్న భర్తలు రోడ్డెక్కి మరీ తమ భార్యలను కాపురానికి రప్పించాలి డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. పుట్టింటికి వెళ్లిన తన భార్య ఎంత చెప్పినా కాపురానికి మాత్రం రావడం లేదు. దీంతో భర్త చేసిన పనికి సదరు భార్య షాక్ అయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తాడేపల్లిలోని పాతూరు గ్రామం లో ఉండే నరసింహ అనే వ్యక్తి భార్య కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త... ఓ రోజు కాల్ చేసి ఇంకా ఎన్నిరోజులు అమ్మవారి ఇంట్లోనే ఉండిపోతావు ఎప్పుడు వస్తావ్ అని అడిగాడు... నేను రాను అని చెప్పాను కదా మళ్లీ ఎందుకు కాల్ చేస్తున్నావు.. మధ్యలో ఓసారి వచ్చిన స్కూటీ తీసుకెళ్ళిపోతాను మళ్లీ మీ ఇంటికి రాను... నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తేల్చేసింది.
దీంతో నరసింహం కోపం రెట్టింపు అయిపోయింది... తన భార్య కాపురానికి రాక పోవడమే కాదు ఏకంగా కాపురానికి రమ్మని అడిగినందుకు నన్ను తిడుతుంద అని భరించలేకపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. దీంతో భార్య ఇంటికి ఒకసారి వచ్చి స్కూటీ తీసుకెళ్తాను అని చెప్పిన మాటలు గుర్తొచ్చి..స్కూటీపై అతని కన్ను పడింది . వెంటనే స్కూటీ పై పెట్రోల్ పోసి నిప్పంటించేసాడు. దీంతో స్కూటీ మొత్తం తగలబడి పోయి బొగ్గు లా మారిపోయింది. ఇక దీంతో దాన్ని ఫోటో తీసి భార్యకు వాట్సప్ పంపి ఇప్పుడు వచ్చి స్కూటీ తీసుకెళ్ళు అని తెలిపాడు. దీంతో భార్య షాక్ అయింది. ఇక ఈ విషయం బార్య తన తల్లిదండ్రులకు చెప్పింది.
ఇక ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం అమ్మాయి తండ్రి... పోలీసులను ఆశ్రయించి అల్లుడు మీద కంప్లైంట్ చేసాడు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని నరసింహం ను అరెస్టు చేసేందుకు బయలుదేరారు. ఇంతలో స్కూటీ తగలబెట్టారు కదా ఇప్పుడు పోలీసులు వచ్చి నీకు తాట తీస్తారు అని భార్య భర్త కు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చింది. దీంతో వడలిపోయిన భర్త... పోలీసులు వచ్చే లోపే తట్ట బుట్ట అంతా సదురుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.