ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని 9 నెలలు కాకముందే వైయస్ జగన్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. జాతీయ మీడియా ఛానల్ లో దక్షిణాదిలో తిరుగులేని రాజకీయ నాయకుడు వైయస్ జగన్ అని ఇప్పటి నుండే కథనాలు ప్రసారం చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి, సంక్షేమ పథకాల గురించి అదే విధంగా అభివృద్ధి గురించి జాతీయ చానల్స్ లో అద్భుతంగా వైయస్ జగన్ పరిపాలిస్తున్నాడు అంటూ తెగ పొగుడుతూ వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇదే తరుణంలో వైఎస్ జగన్ కూడా ఎక్కడా కూడా తన పరిపాలనలో అవినీతి అనేది జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

డైరెక్టుగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ జగన్ కి మంచి వేవ్ క్రియేట్ అయింది. మరోపక్క ప్రత్యర్థి చంద్రబాబుపై రోజుకొక కేసు మరియు ఆయన చేసిన అవినీతి పనులు బయటపడటంతో పాటు ఆయన వయస్సు కూడా మీద పడటంతో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ లోకి రావటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ప్రకాశం జిల్లా నాయకులు చంద్రబాబు హయాంలో టిడిపిలోకి వెళ్లారు.

 

వాళ్లంతా ఇప్పుడు వైసిపి పార్టీ వైపు చూస్తున్నారు. జగన్ తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ ప్రకాశం జిల్లా కి చెందిన వైసీపీ నాయకులంతా చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన ఆఫర్లకు లొంగిపోయి పార్టీ కండువా మార్చడంతో ప్రస్తుతం వాళ్లను పార్టీలోకి తీసుకోవడానికి జగన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో వాళ్లంతా వైసిపి పార్టీ పెద్దల దగ్గర 'మమ్మల్ని మీ పార్టీ లోకి రానివ్వండి..మేము అనవసరంగా గతంలో తప్పు చేశాం మహాప్రభో' అంటూ లబోదిబో మంటున్నారు. మరోపక్క జగన్ మాత్రం నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి పార్టీలో కి రాణించ కూడదని గట్టిగా డిసైడ్ అయినట్లు వైసీపీ పార్టీలో టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: