చైనాలో పుట్టి అనేక దేశాలకు చెందిన ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్‌ రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న కరోనాతో ప్ర‌జ‌ల్లో క‌ల‌వ‌రం పెరిగిపోతోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 3వేల మందికి పైగా చనిపోగా, ఎన్నో వేల మందికి కరోనా ఉన్నట్లు నిర్దారించారు. ఇక హైదరాబాద్‌, ఢిల్లీల్లో కరోనా బాధితులను గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్‌పై ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలన్నారు మోదీ. కరోనా వైరస్‌ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని సోష‌ల్ మీడియాలో ప్రధాని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి.. సరైన వైద్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మోదీ తెలిపారు.

 

కాగా, కరోనా వైరస్‌ బారిన పడకుండా చూసుకోవడం ఆవశ్యకమైంది. అయితే కరోనా వైరస్‌ రాకుండా చూసేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చేతులను ఎప్పుడూ శుభ్రంగా కడుక్కోవాలని, ఆల్కహాల్‌ కలిగిన హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలని చెబుతున్నారు. అయితే ఆల్కహాల్‌ నిజంగానే కరోనా వైరస్‌ను నాశనం చేస్తుందా..? అని అనేక మందికి సందేహాలు వస్తున్నాయి. 

 

మరి ఇందులో నిజం ఉందా.. అంటే..? కరోనా వైరస్‌ ఇప్పటికే వచ్చిన వారు ఆల్కహాల్‌తో చేతులను శుభ్రం చేసుకున్నా, దాన్ని లోపలికి తీసుకున్నా... ఆ వైరస్‌ నాశనం కాదు. కానీ అది ఇతరులకు రాకుండా చూసుకోవచ్చు. ఇక కరోనా వైరస్‌ రాని వారు చేతులను ఆల్కహాల్‌ కలిగిన హ్యాండ్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే ఆ వైరస్‌ నాశనమవుతుంది. ఈ క్రమంలో కనీసం 60 శాతానికి పైగా ఆల్కహాల్‌ ఉన్న హ్యాండ్‌ శానిటైజర్లను వాడాల్సి ఉంటుంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు. ఇక ఆల్కహాల్‌ సేవిస్తే కరోనా నాశనమవుతుందనే వార్తలో నిజం లేదని వైద్యులు చెబుతున్నారు..! సో క‌రోనా వైర‌స్ గురించి, ఆల్క‌హాల్ గురించి పెద్ద‌గా ఆలోచించ‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: