మహిళలు రోజురోజుకూ ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా నిందితులను కఠినంగా శిక్షించి నా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. చట్టాలు ఏం చేస్తాయిలే.. ఇప్పటివరకు అత్యాచారం చేసిన వాళ్లని ఇంకా శిక్షించ లేదు... ఇక కొత్తగా మనని  ఏం చేస్తాయి అని ఎదురుగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే శిక్ష పడుతుందనే భయం కొంచమైనా ఎ ఎవరిలో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. దీంతో మహిళలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ రోజుల్లో సొంత వారి నుంచి కూడా రక్షణ కరువైంది. 

 

 

 

 అయితే తాజాగా జార్ఖండ్ లో కూడా అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15ఏళ్ల మైనర్ బాలికపై కొందరు కామాంధులు.. అనేకసార్లు పశు వాంఛను తీర్చుకున్నారు. ఇక బాధితురాలు శిశు సంక్షేమ కమిటీ ముందు హాజరైన సమయంలో చెప్పిన విషయాలతో అసలు  విషయం వెలుగులోకి రాగా అందరూ అవాక్కయ్యారు. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఏకంగా ముఖ్యమంత్రి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక.... కొన్నాళ్ల క్రితం జాతరకు వెళ్లినది. ఈ క్రమంలోనే ఆ యువతికి భజరంగ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ బాలిక ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ మాట్లాడడం చాటింగ్ చేస్తూ ఉండటం చేసేవాడు. 

 

 

 

 బజరంగ్ అనే యువకుడు ద్వారానే సూరజ్  అనే మరో యువకుడు ఆ బాలికకు పరిచయమయ్యాడు. అయితే ఇద్దరు స్నేహితులు కలిసి ఆ బాలికపై పశువాంచ తీసుకోవాలని అనుకున్నారు. ఓ రోజు కలుద్దాం అని చెప్పి.. ఆ బాలికను బైక్ పై  సింబుకెల్  అనే గ్రామానికి తీసుకెళ్లారు. ఇక కూల్ డ్రింక్ లో  మత్తు పదార్థం కలిపి తాగించి.. ఆ బాలిక మత్తులోకి జారుకోగానే  నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఇద్దరు  ఆ బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేయడమే కాదు ఇదంతా వీడియో తీసి ఆ యువతిని బెదిరించడం మొదలు పెట్టారు. ఇక ఆ వీడియో ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడిన బాధితురాలు ఈ విషయం బయటకు చెప్పకపోవడంతో మరింత రెచ్చిపోయి బాలికపై అనేకమార్లు  అత్యాచారానికి ఒడిగట్టారు.

 

 

 

ఇద్దరే కాదు ఇంకొంత మంది స్నేహితులను కూడా ఆ బాలికపై అత్యాచారానికి ఉసిగొల్పారు. ఇలా ఏకంగా మూడు నెలలపాటు ఆ బాలికపై అనేకమార్లు అత్యాచారం చేయగా ఆ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె పై అత్యాచారం జరిగినట్లు తెలపడంతో తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు.అయితే ఈ ఘటన శిశు సంక్షేమ కమిటీ వరకు వెళ్లడంతో బాధితురాలని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది... ఇక శిశు సంక్షేమ కమిటీ ఎదుట 10 నుండి 12 మంది యువకులు తనపై 30 సార్లకు పైగా లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేశారంటూ నిజాలు బయట పెట్టడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: