కరోనా వైరస్‌ విజృంభిస్తుస్తోంది. ఈ రాక్షస వైరస్‌కు గురై, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా జనాలు మరణించగా.. లక్ష మందికి పైగా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయా దేశాల్లో వారు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.  దీనిపై ఇటు పాల‌కులు అటు ప్ర‌జ‌లు త‌మ‌దైన శైలిలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాలతో పాటు, ఇండియాను కూడా ‘కరోనా’ వైరస్‌ వణికిస్తోంది. దీంతో, పలు నగరాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అయితే, సంచ‌ల‌నాల‌కు మారుపేరైన రాజ‌కీయ‌వేత్త‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మాత్రం దీనిపై ఓ చిత్ర‌మైన కామెంట్ చేశారు. ఢిల్లీ హింసాకాండ నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కరోనాపై పెద్దఎత్తున భయాందోళనలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. త‌ద్వారా రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల ప్రాణాల కంటే...రాజ‌కీయాలే ముఖ్య‌మ‌నే విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావించార‌ని అంటున్నారు.

 

దక్షిణ దినాజ్‌పూర్‌లో జరిగిన తృణముల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మమత మాట్లాడుతూ, ‘ఈ రోజు కొందరు కరోనా, కరోనా అంటూ గట్టిగా అరుస్తున్నారు. అవును ఇది ప్రమాదకరమైన వైరస్సే. కానీ భయాందోళనలు సృష్టించొద్దు. ఢిల్లీ హింసను మరుగునపడేసేందుకు కొన్ని టీవీ చానెళ్లు కరోనా వైరస్‌ను అధికం చేసి చూపుతున్నాయి’ అని విశ్లేషించారు. ‘ఢిల్లీ హింసలో చనిపోయినవారు కరోనా వైరస్‌తోగానీ లేదా ఇతర వ్యాధులతోగానీ చనిపోలేదు. వారు అలా చనిపోతే కనీసం ఫలానా వ్యాధితో మరణించారని తెలిసేది. కానీ, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న ప్రజలు అతి క్రూరంగా కాల్చి చంపబడ్డారు’ అని మండిప‌డ్డారు. 

 


మ‌రోవైపు కలకత్తాలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తామేం త‌క్కువ తిన‌లేద‌ని క‌రోనాను రాజ‌కీయాల‌కు వాడుకున్నారు. ఫేస్‌ మాస్క్‌లను వినూత్నంగా తయారు చేసి, ప్రజలకు అందజేస్తున్నారు. మాస్క్‌లపై ‘సేవ్‌ ఫ్రమ్‌ కరోనా ఇన్‌ఫెక్షన్‌ మోడిజీ’ అని ప్రింట్‌ వేయించారు. మాస్క్‌పై బీజేపీ ఎన్నికల గుర్తు కూడా ఉండడం గమనార్హం. ఈ మాస్క్‌లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. క‌రోనాపై అంద‌రిలోనూ త‌గు జాగ్ర‌త్త మొద‌లైన సమ‌యంలో ఇలా నేత‌ల రాజ‌కీయాలు చూసి జ‌నాలు న‌వ్వుకొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: