రాజకీయంగా ఎత్తులు, పై ఎత్తులు వేయటంలో  జగన్మోహన్ రెడ్డిని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నాడా ? ఆయన రియాక్షన్ చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. తాజాగా వైసిపి తరపున భర్తీ చేయాల్సిన నాలుగు రాజ్యసభ ఎంపిల్లో జగన్ ఎంపిక  చేసిన అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. నాలుగు స్ధానాల్లో రెండు బిసిలకు కేటాయించటంతో పాటు మరో స్ధానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు పరిమళ్ ధీరజ్ నత్వానికి కేటాయించాడు.

 

నాలుగో స్ధానం కూడా జగన్ కు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యా రామిరెడ్డికే కేటాయించినా ఆయన స్ధానికుడే అన్న విషయం మరచిపోకూడదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భర్తీ చేయాల్సిన నాలుగు స్ధానాల్లో రెండు బిసిలకే కేటాయించాడు జగన్. గతంలో ఏ పార్టీ కూడా సగం స్ధానాలను వెనుకబడిన కులాలకు కేటాయించిన చరిత్ర లేదు. మొట్టమొదటిసారి సగం స్ధానాలను బిసిలకు కేటాయించటమంటే జగన్ చరిత్ర సృష్టించినట్లే లెక్క.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా బిసి రిజర్వేషన్ రచ్చ జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే. రిజర్వేషన్లపై చంద్రబాబు చేసిన కంపు వల్ల వాళ్ళకు అందిన ఫలాలు  34 శాతం నుండి 24 శాతానికి పడిపోయింది. ఇటువంటి సమయంలో తన చేతిలో ఉన్న  సీట్లను జగన్ 50 శాతం బిసిలకు కేటాయించటం వ్యూహాత్మకమే. ఇక రెండో అంశం ఏమిటంటే నత్వానికి రాజ్యసభ అవకాశం కల్సించటం కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది.

 

నత్వాని అనే పారిశ్రామికరంగంలోని ప్రముఖుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు లెక్క ప్రకారం రిలయన్స్ అధినేత తనకు మాత్రమే సన్నిహితుడు. అలాంటిది తన బద్ధశతృవు అయిన జగన్ తో ముఖేష్ చేతులు కలపటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు అయ్యుంటే తానే ముంబాయ్ వెళ్ళి ముఖేష్ ను కలిసేవాడేమో. కానీ ఇక్కడ రిలయన్స్ అధినేతే అమరావతికి వచ్చి జగన్ ను కలవటాన్ని తట్టుకోలేకపోతున్నాడు. మొత్తానికి రాజ్యసభ స్ధానాల భర్తీలో జగన్ మాత్రం చంద్రబాబును బాగానే దెబ్బ కొట్టినట్లైంది.

 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: