ఏపీ అసెంబ్లీలో వైసీపీ కి కనివిని ఎరుగని మెజారిటీ ఉంది. కానీ శాసనమండలి విషయానికి వస్తే అక్కడ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. శాసనసభలో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి శాసనమండలికి పంపిస్తే అక్కడ టిడిపి అడ్డుకుంటోంది. ఇప్పటికే అనేక బిల్లు విషయంలో ఇదే విధంగా జరిగింది. అనేక సందర్భాల్లో ఈ విధంగానే శాసనమండలిలో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. అంతేకాకుండా మూడు రాజధానుల విషయంలోనూ ఇదే విధంగా టిడిపి వ్యవహరించింది. ఇక ముందు ముందు కూడా ఇదేవిధంగా వ్యవహరించే అవకాశం ఉండడంతో ఏపీ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు జగన్. 


ప్రస్తుతం ఈ వ్యవహారం కేంద్రం కోర్టులో ఉంది. కేంద్రం కూడా జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలకడంతో పాటు, శాసనమండలిని రద్దు చేసేందుకు కూడా సముఖంగా ఉంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే, శాసన మండలి సభ్యత్వం ద్వారా మంత్రి పదవులు దక్కించుకున్న జగన్ కు  అత్యంత సన్నిహితులు, వీర విధేయులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ శాసనమండలి రద్దు అయితే మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో వారికి రాజ్యసభ సభ్యత్వం కట్ట పెడతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఇప్పుడు జగన్ ఆ ఇద్దరు బీసీ మంత్రులకు రాజ్యసభ  సభ్యత్వం కట్టబెట్టారు. 

IHG


ఈ వ్యవహారంతో త్వరలోనే శాసన మండలి రద్దు కాబోతోందని సంకేతాలను జగన్ ఈ విధంగా తెలియజేశారు అని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బీజేపీకి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితమైన పరిమళ్ నత్వానికి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం జగన్ కట్టబెట్టడం తో శాసనమండలిని త్వరలోనే కేంద్రం రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా ఏపీ కి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్వీలో ఉన్న అన్ని బిల్లులు, అన్ని నిర్ణయాలను జగన్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు బిజెపి సిద్ధపడుతున్నట్లు గా సంకేతాలు ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: