మార్చి 24 వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఇంకా ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగగాయి. ఒకసారి చరిత్రలోకి వెళితే ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 భారత ప్రధానమంత్రి : 1977 మార్చి 24 వ తేదీన  భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవి  విరమణ చేయడం అదే రోజున భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితులయ్యారు. 

 

 ముత్తుస్వామి దీక్షితులు జననం : కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన వాగ్గేయకారులు వీణ విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితులు 1775 మార్చి 24 వ తేదీన జన్మించారు. ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన కృతులు తెలుగు కంటే ఎక్కువగా సంస్కృతంలో రాయబడ్డాయి. వీరు  కొన్ని కృతులు తమిళము సంస్కృతుల సమ్మేళనం లో కూడా రాయబడ్డాయి. గురుగుహ అనేది వీరి మకుటం . ఈయన  అన్ని రచనల్లోనూ గురుగుహ అనే మకుటం కనిపిస్తూ ఉంటుంది. ఈయన  500కు పైగా కీర్తనలు రాసి ఎంతో ప్రసిద్ధి చెందారు. వీరు సంగీత వ్యాకరణ జ్యోతిష వాస్తు మాంత్రిక వైద్య విద్యలో కూడా ఆరితేరిన వ్యక్తి. భక్తి శ్రద్దలు గల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు సంస్కృతంతో పాటు శాస్ర్తీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. కాశీలో గడిచిన కాలం లో హిందుస్తానీ సంగీతం అయినా సృజనాత్మకత పై తీవ్ర ప్రభావం చూపింది. ఇక ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత అభివృద్ధికి  ఎంతో ప్రసిద్ధి చెందేలా చేశారు. 

 

 పుట్టపర్తి నారాయణాచార్యులు జననం : తెలుగు పదాలతో శివతాండవం ఆడించిన కవి... తెలుగులో ఎంతో హొయలుగా గేయం సాగడానికి సహకరించిన గొప్ప వ్యక్తి పుట్టపర్తి నారాయణాచార్యులు 1914 మార్చి 24వ తేదీన జన్మించారు. సంగీతానికి సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం పుట్టపర్తి నారాయణాచార్యులు. తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. బహు భాషా కోవిదుడు. పుట్టపర్తి నారాయణాచార్యులు విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనివ్వదు... కనురెప్పలను వాల్చ నివ్వదు .. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం అని చెప్పారు. అందుకే పుట్టపర్తి నారాయణాచార్యులు రాసిన కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు ఉంటారు. నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం భాగవతం పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. అంతేకాకుండా వ్యాకరణం ఛందస్సు భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. ఇలా అన్నిట్లో ఆరితేరారు పుట్టపర్తి నారాయణాచార్యులు. 

 

 ఆండ్రియాన్ డిసౌజా జననం : ఎంతో ప్రఖ్యాతి చెందిన భారత హాకీ క్రీడాకారుడు ఆండ్రియన్ డిసౌజా  1984 మార్చి 24 వ తేదీన జన్మించారు. అయినా భారత హాకీ క్రీడలో ప్రేక్షకులకు చేర్చడం లో ఎంతగానో కృషి చేశారు. 

 

 అవసరాల సూర్యారావు మరణం : ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్ల బూట్లు,  పంజరం  మొదలైన నాటికలు రాశారు అవసరాల సూర్యారావు. 1963 మార్చి 24 వ తేదీన మరణించారు. 

 

 వీడి రాజప్పన్ మరణం : మలయాళం సినిమా హాస్యనటుడు అయిన వీడి రాజప్పన్  2016 మార్చి 24 వ తేదీన జన్మించారు. హాస్య నటుడిగా ఎన్నో మలయాళ సినిమాలలో నటించిన ఈయన ఎంతగానో గుర్తింపు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: