ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లో ప్రవేశించి నిద్ర పట్టకుండా చేస్తుంది.  ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కు సంబంధించిన తగు సూచనలు, సలహాలు ప్రజలకు ఇస్తూనే ఉన్నారు.  అంతే కాదు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఎన్ని కట్టుదిట్టాలు చేస్తూనే కరోనా కేసులు రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉన్నాయి.  తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 562 కి చేరిపోయాయి. ఇక మహారాష్ట్రలో సెంచరీ దాటిపోయింది.. ముగ్గురు మరణించారు.  తాజాగా తెలంగాణలో సైతం కరోనా 39 మందికి సోకిందని చెబుతున్నారు.  కాకపోతే ఇప్పటి వరకు కరోనా మరణాలు విదేశాల నుంచి వచ్చినవారికే సోకిందని అంటున్నారు. ప్రస్తుతం 512 మంది బాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

 

ఇప్పటివరకు 50 మంది కరోనా బాధితులు కోలుకున్నారని వెల్లడించింది.  తాజాగా భద్రాద్రి కొత్తగూడం పాజిటివ్ వచ్చిన యువకుడితో కలిసి ఉన్న మరో ఇద్దరికి కరోనా వచ్చినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. భద్రాద్రి కొతగూడానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి, మరో వృద్ధురాలికి కరోనా సోకినట్లు వివరించింది. దీంతో తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా కేసుల సంఖ్య 5కు చేరింది. కరోనా వైరస్ ఎంత ప్రభావం చూపిస్తుందంటే.. ఐనవారు స్నేహితులు అన్న విషయాన్ని పట్టించుకోకుండా అందరినీ దూరం పెడుతున్న సమయం. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా కరీంనగర్ లో దయనీయ పరిస్థితి కరీంనగర్‌లో చోటు చేసుకుంది. 

 

ఇక్కడ కాశ్మీరీ గడ్డలో ఓ వృద్దుడు కూరగాయలు కొనేందుకు వచ్చాడు.. కానీ ఉన్నట్టుండి అతనికి గుండె పోటు రావడంతో అక్కడే కుప్పకూలి మృతి చెందాడు.  దాంతో అతనికి ఏమైనా కరోనా ఉందేమో అన్న అనుమానంతో ఎవరూ దగ్గరకు కూడా వెళ్లలేదు. ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక్కడ ఇండోనేషియా వాసులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తమకు సోకుతుందేమోనని భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: