తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 70కు చేరింది. ప్రగతి భవన్ లో నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో కరోనా గురించి జరుగుతున్న ప్రచారం గురించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
కరోనా పట్ల ఎటువంటి దుష్ప్రచారం చేసినా సహించే ప్రసక్తే లేదని తెలిపారు. అలాంటి దిక్కుమాలిన చిల్లరగాళ్లకు, దుర్మార్గులకు కరోనా సోకుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెడితే ఎలా ఉంటుందో వారికి చూపెడతామని వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో తీవ్ర భయభ్రాంతులకు గురవుతోందని.... పనికిమాలిన దుర్మార్గులు మాత్రం ప్రజలను ఫేక్ న్యూస్ తో తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. 
 
ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. తెలంగాణ బిడ్డగా రైతులకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్ 7 తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
అధిక ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్న కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా విషయంలో ఎటువంటి దాపరికం లేకుండా సమాచారం ఇస్తున్నామని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ ఎంతో కృషి చేస్తున్నారని సీఎం ప్రశంసించారు. ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నప్పటికీ దుష్ప్రచారాలు చేయడం సరికాదని సూచించారు. కరీంనగర్ లో పరిస్థితులు చక్క బడతాయని సీఎం తెలిపారు. శనివారం రోజున మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలిందని... ఆ వ్యక్తి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న వ్యక్తి కాదని అన్నారు. 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: