దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయమే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తున్న మహమ్మారి వైరస్ కారణంగా దేశ ప్రజలందరి ప్రాణ భయంతో బ్రతుకు నెట్టుకొస్తున్నారు. కంటికి కనిపించని మృత్యువు ఎక్కడ దాడి చేస్తుందో  అని ప్రాణభయంతో బతుకుతున్నారు. రోజురోజుకు కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్కు సరైన వ్యాక్సిన్ లేకపోవడం కేవలం వ్యక్తిగత పరిశుభ్రత ముందస్తు జాగ్రత్తలు లాంటి నివారణ చర్యలు అందరికీ వైరస్ నుంచి తప్పించుకునేందుకు మార్గం అయ్యాయి . అయితే భారతదేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మాస్క్ లకు ఎక్కువగా డిమాండ్ పెరిగి పోయిన విషయం తెలిసిందే. 

 

 

 ముఖ్యంగా హై క్వాలిటీ ఉండే ఎన్95 ఫేస్ మాస్క్ లకి ఎక్కువగా డిమాండ్ వచ్చింది. ఇక కరోనా  వైరస్ నేపథ్యంలో మాస్క్ లకి వచ్చిన డిమాండ్ ను  వ్యాపారులు కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. అవసరాన్ని అవకాశంగా మార్చుకొని ఆసరాగా చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల అక్రమంగా నిలువ ఉంచిన మాస్క్ లను పోలీసుల దాడుల్లో  బయటపడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా బెంగళూరులో అక్రమా మాస్కుల  దండా బయట పడింది. లక్షల విలువచేసే  ఎన్ 95 మాస్క్ లను సీజ్ చేశారు అధికారులు. 

 

 

 కళ్యాణ్ నగర్ లోని గిడ్డంగి  పై సోమవారం రాత్రి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు నిర్వహించారు.. 12, 300 నకిలీ ఎన్95 ఫేస్ మాస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు నిందితులు 70000 మాస్క్ లను 1.55 కోట్ల వ్యయంతో విక్రయించాడు అంటూ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా విశ్వసనీయ సమాచారంతో సోమవారం రాత్రి బెంగళూరు కళ్యాణ్ నగర్ లోని గిడ్డంగి పై దాడులు నిర్వహించగా 20 లక్షల విలువైన 12300 మాస్క్ లను స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు. ప్రస్తుతం మార్కెట్లో ఈ మాస్కుల  కొరత ఏర్పడి ఎక్కువ డిమాండ్ ఉండటం కారణంగా... అక్రమంగా నిల్వ ఉంచి ఈ మాస్క్ లను అధిక ధరలకు అమ్ముతున్నట్లు  అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: