భారత్ లో  కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ... ప్రజలందరూ కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేలా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేలా సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే అటు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కరోనా వైరస్ పై  సరికొత్త ప్రచారం తెరమీదికి వస్తూనే ఉంది. ఏదో ఒక విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 ఆరోగ్యానికి ఎంతో మేలైన క్యాబేజీ తినడం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని... క్యాబేజీ ఆకుల పై కరోనా వైరస్ 30 గంటల పాటు జీవించే అవకాశం ఉందని... దీనిని స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది అంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇక ఈ వార్త ప్రజలను బాగా ప్రభావితం చేయడంతో క్యాబేజీని కొనుక్కోవడమే మానేసారు ప్రజలు. ఇకపోతే ఈ వార్త కాస్త వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరకు వెళ్లడంతో దీనిపై స్పందించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ఈ వార్తల్లో నిజం లేదు అంటూ తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మి ప్రజలు  ఆందోళన చెందవద్దని వివరించింది. 

 

 

 డాక్టర్ల సలహా మేరకు ఇతర కూరగాయలు ఎలా తీసుకుంటున్నారో  అదేవిధంగా క్యాబేజీని కూడా కొన్న తర్వాత వేడినీటిలో కడగాలని... ఆ తరువాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి అంటూ సూచించింది. ఆ తర్వాత క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా ఉడికించుకోవాలి అంటూ సూచించింది. సగం ఉడికిన క్యాబేజీ తినడం మంచిది కాదు అని తెలిపింది. ఇదిలా ఉంటే బేకరీ ఉత్పత్తులను తినడం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టుగా మరో వార్త హల్చల్ చేస్తుండగా ఇలాంటి ప్రకటన ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: