తెలంగాణ‌లో వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎలాంటి నూతన షెడ్యూల్‌ ప్రకటించలేదని పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ అంటూ వాట్సాప్ లో వైరల్‌ అవుతున్న వార్తలు అవాస్తవమని అన్నారు.  ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించారు. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన తెలిసిందే. 

 

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ అంటూ వాట్సా‌ప్ లో వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజం లేద వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని  విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాంటి అలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు. ఈనెల 14 తర్వాత ప్రభుత్వంతో చర్చించి  కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు. 

 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభన  ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పిల్లల సెఫ్టీ నేపథ్యంలోనే పదవ తరగతి పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  కొత్త షెడ్యూల్‌ను త్వరలో తెలియజేస్తామని అంటున్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: