దేశంలో క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డిచేయ‌గ‌లిగామ‌ని, ప‌క‌డ్బందీ చ‌ర్య‌ల‌తో వైర‌స్‌ను అదుపులో ఉంచ‌గ‌లిగామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి భార‌త్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌పంచ‌దేశాల‌ను మెచ్చుకుంటున్నాయ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డిపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సోమ‌వారం రాత్రి ఏడుగంట‌ల‌కు సీఎం కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో జ‌న‌తా క‌ర్ఫ్యూ త‌ర్వాత లాక్‌డౌన్ పాటిస్తున్నామ‌ని, ఇవి మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇత‌ర దేశాల‌తో పోల్చితే భార‌త్ చాలా సేఫ్‌గా ఉంద‌ని కేసీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 4314 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. అమెరికా లాంటి ప‌రిస్థితి మ‌న‌కు వ‌చ్చి ఉంటే.. కోట్లాది మంది చ‌నిపోయేవార‌ని ఆయ‌న అన్నారు. 

 

విదేశాల నుంచి వ‌చ్చిన వారి నుంచే క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందింద‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. ఇక తెలంగాణ‌లో కూడా వైర‌స్‌క‌ట్ట‌డికి ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌లో మొత్తం 364 కేసులు న‌మోదు అయ్యాయ‌ని.. ఇందులో 11మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని ఆయ‌న తెలిపారు. మొత్తం 45మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్ల‌డించారు. 308మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌న్నారు. ఇందులో ఎక్కువ‌గా త‌బ్లిఘి జామ‌త్‌కు వెళ్లి వ‌చ్చిన వారే ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. త‌బ్లిఘి జ‌మాత్‌కు తెలంగాణ నుంచి హాజ‌రైన వారిలో ఇప్ప‌టికే 1089మందిని గుర్తించి, క్వారంటైన్లో ఉంచామ‌ని తెలిపారు. ఇక‌ అమెరికా లాంటి దేశాలే క‌రోనాను ఎదుర్కొన‌లేక‌పోతున్నాయ‌ని, కానీ మ‌నం అద్భుత‌మైన చ‌ర్య‌ల‌తో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లుగుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ నేప‌థ్యంలో 

మరింత సమాచారం తెలుసుకోండి: