కరోనాపై యావత్ ప్రపంచం యుద్ధం చేస్తుంది . క‌రోనాపై పోరాటానికి ఎంతో మంది సెల‌బ్రిటీలు త‌మ వంతుగా భారీ విరాళాలు ఇస్తున్నారు. మ‌న దేశంలో ర‌త‌న్ టాటా అయితే ఏకంగా రు. 1500 కోట్లు విరాళం ఇచ్చారు. ఇక సినీ ప్ర‌ముఖులు కూడా భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సైతం క‌రోనాపై పోరుకు తాము సైతం సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ బాధితుల కోసం పద్మావతి నిలయాన్ని ఆస్పత్రిగా మార్చేందుకు అంగీక‌రించిన టీటీడీ ఇప్పుడు క‌రోనా పాజిటివ్ బాధితుల కోసం వెంటిలేటర్లు , మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది. 

 

టీటీడీ పైన చెప్పుకున్న ప‌రికరాల కోసం రు. 19 కోట్లు ఇక చిత్తూరు క‌లెక్ట‌ర్ కోరిక మేర‌కు ఇప్ప‌టికే రు. 8 కోట్లు ఇచ్చిన టీటీడీ అధికారులు ఇప్పుడు మ‌రో రు. 11 కోట్లు త్వ‌రలోనే అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. అలాగే ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో చాలా మంది నిరుపేద‌లు, వ‌ల‌స కూలీలు క‌నీసం తినేందుకు కూడా భోజ‌నం లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక వీరితో పాటు యాచ‌కుల‌కు రోజుకు లక్షా 20వేల ఫుడ్ ప్యాకెట్లను టీటీడీ పంపిణీ చేస్తుంది . అలాగే తిరుమల కొండపై ఉన్న విశ్రాంతి గదుల్లో కొందరికి ఆశ్రయం ఇచ్చారు. ఏదేమైనా తిరుమ‌ల శ్రీనివాసుడు ఈ రూపంలో కూడా ఎంతో మందిని ఆదుకుంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌నకు చేతులెత్తి మొక్కాల్సిందే.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: