కరోనా వైరస్  రోజురోజుకు భారతదేశంలో విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా ను  కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించింది. ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్  విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్  విధించినప్పడికి కరోనా  వైరస్ కంట్రోల్ లోకి రాని నేపథ్యంలో లాక్ డౌన్ పొడగిస్తారా లేదా  అనే అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్  పొడిగించాలా వద్దా అనే దానిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్రంలో పలు చోట్ల లాక్ డౌన్  ఎత్తి వేయాలి అంటూ ప్రధానమంత్రి సూచించడం పై రాజకీయ విశ్లేషకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

 


 ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మొదట్లో తక్కువ మొత్తంలో ఉన్న కరోనా  వైరస్ ప్రస్తుతం చేయి దాటి పోయే పరిస్థితి వచ్చింది.. ఇలాంటి సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్  కొనసాగించేందుకు మొగ్గు చెబుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే.. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్  ప్రకటించి.. గ్రీన్ జోన్ గా  ఉన్న ప్రాంతాలలో మాత్రమే లాక్ డౌన్ ఎత్తి  వేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు. 

 


 అయితే రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగిన సమయంలో ఎవరూ కట్టడి చేయలేకపోయారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్  కొనసాగి..  మరికొన్ని ప్రాంతాలో  లాక్ డౌన్ ఎత్తేస్తే  పరిస్థితులు చేయి దాటి పోతామని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎప్పుడెప్పుడు లాక్ డౌన్  ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలా అనే  తొందరపాటు తగదు అని చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు... కానీ ప్రజల ప్రాణాలు పోతే మాత్రం మళ్లీ తీసుకురాలేము అంటున్నారు. ఇప్పుడువరకు కరోనా ను  ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ సమర్ధవంతంగా పని చేసిందని కానీ ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలనే తొందరపాటుతో  తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సరైనది కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: