కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మక ఆలోచనలు చేస్తున్నారు. దాదాపు 200 కోట్లకు పైగానే రోజు నష్టం వస్తుందని అయినా గాని ప్రజల ప్రాణాలు ముఖ్యమంటూ లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు కేసిఆర్ తేల్చి చెప్పటం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పగడ్బందీగా లాక్ డౌన్ చేపట్టేలా ఇప్పటినుండే కేసిఆర్ అధికారులతో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు కేసిఆర్. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం హైదరాబాద్ నగరం నుండి రావడంతో.. ఏమాత్రం కరోనా వైరస్ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంపై పడకుండా… పారిశ్రామికవేత్తల దృష్టిలో చెడ్డ పేరు రాకుండా కొన్ని కఠినమైన నిర్ణయాలు కేసీఆర్ ఇటీవల తీసుకున్నట్లు సమాచారం.

 

ఈ సందర్భంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసిఆర్ సమీక్ష చేశారు. హైదరాబాద్ లో కేసులు అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణలో ఈరోజు మరో 32 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 563కి చేరింది.

 

ఎక్కువగా కేసులు ఉన్న జీహెచ్ ఎంసీ పరిధిలో 17 సర్కిళ్లను 17 జోన్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన ఆదేశించారు. ప్రతిరోజూ జోన్ల వారీగా సమీక్షించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు సీఎం సూచించారు. ఇదే టైం లో ప్రజలు ఎవ్వరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు పూర్తిగా బాధ్యత వహించి వ్యవహరించాలని కేసీఆర్ ఈ సమావేశంలో తెలిపారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: