ప్రస్తుతం ప్రపంచం ఒక వైపు కరోనాతో ఇబ్బంది పడుతుంటే... మరోవైపు మోసగాళ్లు వారి తెలివితేటలను ఉపయోగించి అవతల వాళ్ళని మోసం చేయడంలో బిజీగా మారిపోయారు. ఇక అసలు విషయానికొస్తే... ముంబైలో ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తికి తాను మామూలుగా నీలి చిత్రాలను చూసే అలవాటు కలిగి ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఒక హ్యాకర్ల ముఠా చాలా పోర్న్ సైట్లకు తమ యాడ్ ను ఇస్తూ వస్తోంది. దానికిగాను ఆ లింకును క్లిక్ చేస్తే లేదా వీడియోని క్లిక్ చేస్తే పాప్ అప్ రూపంలో ఒక యాడ్ వస్తుంది. అలా వచ్చిన పాప్ అప్ లో ఏదైనా ఒక లింక్ను క్లిక్ చేస్తే చాలు ఇక అంతే.


అలా క్రియేట్ చేయడం వల్ల ఒక సైబర్ బగ్, అంటే కంప్యూటర్ వైరస్ లాంటిదే అనుకోండి. అది మన కంప్యూటర్ లేదా మొబైల్ లోకి ఇన్స్టాల్ అవుతుంది. అది అలా  ఇన్స్టాల్ అయినట్లు మనం కూడా తెలవదు. ఇది అక్కడే ఉంటూ ఆ బాధితుడు కంప్యూటర్ లేదా మొబైల్ లో ఏఏ పనులు చేస్తున్నాడు ఆ డేటా మొత్తాన్ని సేకరించి వైరస్ సృష్టించిన యజమాని చెంతకు ఇది చేరవేస్తుంది.

 

హ్యాకర్ మొత్తం  డేటా, ఐడీలు, పాస్వర్డ్ అలాంటివి అన్నీ తెలుసుకొని ఒక నాలుగు రోజుల తర్వాత ఈమెయిల్ ను బాధితుడికి పంపిస్తున్నారు. అందులో ఒక షాకింగ్ విషయం కనబడుతుంది అదేమిటంటే పలానా వెబ్సైట్లో నువ్వు బూతు బొమ్మలు చూసావని ఏ బ్లూ ఫిలిమ్స్ నువ్వు చూశావో మా సీక్రెట్ కెమెరాలో రికార్డు అయింది అని అందులో ఉంటుంది. అంతే కాకుండా ఆ వీడియోని నీకు సంబంధిత ఫ్రెండ్స్, ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి పంపిస్తామని అందులో ఉంటుంది. ఒకవేళ అలా చేయకూడదు అనుకుంటే నువ్వు మాకు రూ. 2.21  బిట్ కాయిన్స్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తారు.


అయితే బాధితుడు సదరు బాధితులు ఈ విషయాన్ని గ్రహించి, నా సీక్రెట్ వీళ్లకు తెలిసిందంటే నిజంగానే వారు వీడియో తీసి ఉంటారని భయపడ్డాడు. అంతేకాకుండా ఆ వీడియో బయటికి వస్తే నా పరువు పోతుంది అని వాళ్లకు డబ్బు చెల్లించేందుకు సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. అయితే ఆన్లైన్లో బిట్ కాయిన్ ఎలా కొనాలి హ్యాకర్ బాధితుడికి నేర్పించాడు కూడా. అయితే ఇది ఇలా ఉండగా బాధితుడు ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ కి చేరవేయడంతో అతను డబ్బులు కట్టవద్దని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని కాస్త గట్టిగా చెప్పడంతో ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో ఆ సదరు వ్యక్తి అమెరికా లేదా యూరప్ నుంచి హ్యాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: