ప్రస్తుతం కరోనా వైరస్ పోరాటం కోసం దేశవ్యాప్తంగా లాక్ డోన్ విధానం మే 3 తో ముగింపు పలకబోతుంది. ఈ విధానంతో దేశంలో ఆర్థిక వ్యవస్థతో అన్నీ కూడా మూతపడ్డాయి అనే చెప్పాలి. ముందుగా ఏప్రిల్ 14 వరకు ఈ విధానాన్ని విధిస్తున్నట్లు తెలిపిన ఆ తర్వాత మే 3 వరకు పొడిగించినట్లు భారత ప్రధాని మోడీ తెలియజేయడం జరిగింది. ఇక లాక్ డౌన్ 2.0 గడువు కూడా దగ్గరపడుతుండడంతో ప్రజలలో భయాందోళనలో మొదలయింది. ఎందుకనగా రోజురోజుకీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధిక సంఖ్యలో నమోదు అవుతుంది. మరి ఈ సమయంలో లాక్ డౌన్ విధానాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపి వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ప్రజలలో. 

 


అంతే కాకుండా ఒకవేళ లాక్ డౌన్ విధానాన్ని పొడిగిస్తే.. దేశ ప్రజలు ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోగలరా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఇప్పటికే దేశ GDP కు 10 నుంచి 13 లక్షల కోట్ల వరకు నష్టం వచ్చినట్లు కూడా అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగుల పైన కూడా తీవ్రస్థాయిలో ప్రభావం పడింది అనే చెప్పాలి. ఇక ఒక్క రోజుకు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా 30 నుంచి 40 వేల కోట్ల నష్టం కూడా వస్తుంది అని అంచనా వేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు లాక్ డౌన్ కారణంగా 10 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారు. 

 


ఇక మరోవైపు కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థ ప్రభావంతో కేంద్రం ప్రభుత్వం ఈ సమయంలో లాక్ డౌన్ ను పొడిగిస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అని... ఒకవేళ పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ మేరకు ఇక గ్రీన్ జోన్ ఏరియాలలో ఆర్ధిక కార్యకలాపాలకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: