దేశ వ్యాప్తంగా  రోజు రోజు కు కరోనా కేసుల సంఖ్య  ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే 1700 కరోనా కేసులు నమోదయ్యాయని సమాచారం. వీటిలో ఎక్కువగా మహారాష్ట్రలో 597 కేసులు నమోదుకాగా 32 మరణాలు సంభవించాయి అలాగే గుజరాత్ లో 300 కు పైగా కేసులు నమోదు కాగా ఢిల్లీ లో 125 కేసులు తమిళనాడు లో 104 కేసులు నమోదయ్యాయి. 
 
ఓవరాల్ గా ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 33000 దాటగా 1000కి పైగా మరణించారు. లాక్ డౌన్ కొనసాగుతున్నా కూడా పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. మరో నాలుగు రోజుల్లో రెండో దశ లాక్ డౌన్ కూడా ముగియనుంది. ఆతరువాత మరిన్ని సడలింపులు ఇస్తామని  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ మినహాయింపులు కేవలం గ్రీన్ జోన్ లకే వర్తించనున్నాయి. హాట్ స్పాట్ ఏరియాల్లో మరి కొన్ని రోజులు పూర్తి లాక్ డౌన్ కొనసాగనుంది. 
 
ఇక వచ్చే నెల 2న ప్రధాని మోదీ లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ ను పొడిగించాల్సిందిగా కోరాయి. అయితే కరోనా ప్రభావం లేని రాష్ట్రాల్లో పూర్తిగా మినాహాయింపులు ఇచ్చి ఆర్థిక వ్యవస్థ ను మళ్ళీ గాడిలో పెట్టాలని నిపుణులు చూసిస్తున్నారు. ఇక కేంద్రం తో సంబంధం లేకుండా  పంజాబ్ మరో రెండు వారాలు కర్ఫ్యూ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు  తెలంగాణ లో మాత్రం వచ్చే నెల 7వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఇప్పటికే అక్కడ కరోనా తగ్గుముఖం పట్టింది. మరి 7తరువాత తెలంగాణ, కేంద్రం ఇచ్చే సడలింపులు అమలు చేస్తుందానేదని ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: