తిరుమల తిరుపతి లో ఒక అద్భుతమైన చిత్రం కనిపించి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తిరుపతి లోని అలిపిరి లో నివసిస్తున్న ఒక ఆవు నుదిటిపై శ్రీ వెంకటేశ్వర స్వామి ధరించే తిరునామం లాగానే సహజసిద్ధంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తం గా కఠినమైన లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు బయటకు రావడం లేదు. దాంతో మూగ జీవాలకి ఆహారం వేయడానికి ఎవరు ముందుకు రాలేకపోతున్నడంతో... అవి ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు ఆకలి తో బాధపడుతున్న గోవులకు ప్రతిరోజు గ్రాసం అందిస్తున్నారు. 

 


కరోనా మహమ్మారి కారణంగా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 45 రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య సున్నా గా కొనసాగుతుంది. ఎప్పుడూ లక్షల సంఖ్యలో భక్తులతో కిటకిట లాడే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం జన సమూహాలు లేక వెలవెలబోతోంది. లాక్ డౌన్ లిఫ్ట్ చేసేంతవరకు దర్శనానికి వచ్చే భక్తులను ఎట్టి పరిస్థితులలో అనుమతించబోమని టీటీడీ సంస్థ తెలిపింది. భక్తులు రాకపోయినప్పటికీ స్వామి వారి ఆలయంలో కైంకర్యాలు మాత్రం ఎప్పటిలాగానే జరుగుతున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. 

 


ఇకపోతే శ్రీవారి తిరునామం తో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ గోవుని శ్రీ వారి ఆలయ ప్రాంగణంలో కొన్ని రోజుల పాటు ఉంచితే భక్తులు తండోప తండాలుగా చూసేందుకు తరలి వస్తారని టీటీడీ యాజమాన్యం భావిస్తోంది. ఎంతైనా సహజ సిద్ధంగా తిరునామం తో పుట్టిన ఈ గోవు చాలా ప్రత్యేకమైనదని అక్కడి అయ్యగారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆవు కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. నెటిజనులు కూడా ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. వెంకటేశ్వర స్వామి తిరునామం తో ఉన్న ఆవు ను చూస్తే మంచి జరుగుతుందని సామాజిక మాధ్యమాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ ఆవు తిరునామం తో పుట్టడం ఆశ్చర్యకరమైన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: