అయ్య బాబోయ్ ఇది కరోనా యుగమే కాదు బాసు. కోతల యుగం కూడా. కరోనా ఎఫెక్ట్ పేరుతో ప్రభుత్వ, ప్రవేటు అనే తేడా లేకుండా అందరి జీతాల్లోనూ కోతలు ఎడాపెడా విధించేస్తున్నారు. ఎవరికీ జీతాల్లో కోతల నుంచి మినహాయింపులు ఏమీ లేవు. అందరి జీతాల్లోనూ లేదా పెడా కోతలు విధించేస్తున్నారు. ఏమన్నా అంటే కరోనా అనేస్తున్నారు. అనడం కాదు కానీ నిజంగానే ఇది వాస్తవం. కరోనా దెబ్బకు అన్ని సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. అన్ని రాష్టాల ప్రభుత్వాలు ఆర్ధిక ఇబ్బందులతో ఉద్యోగస్తుల జీతాల్లో కోతలు విధించాయి. ఇక ఎప్పుడూ సంక్షోభంలో కొట్టుమిట్టాడే మీడియా సంస్థల సంగతి అయితే చెప్పనవసరంలేదు. ఎప్పడూ ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి. ఇప్పుడు కరోనా మరింత గుదిబండలా మారింది.
 

IHG

పత్రికలు, ఛానెళ్ల నిర్వహణ భారమై ఆర్ధికంగా సతమతం అవుతున్నాయి. ఈ దశలో కొన్ని మీడియా సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించగా, మరికొన్ని ఉద్యోగస్తులను తొలిగించే పనిలో ఉన్నాయి. మరికొన్ని ఆర్ధికంగా భారమైనా, ఉద్యోగస్తుల జీతాల్లో ఎటువంటి కోతలు పెట్టకుండా ఇచ్చేస్తున్నాయి. ఇక మరికొన్ని మాత్రం ఉద్యోగస్తులను పోషించలేక, భారంగా నష్టాలతో పత్రికలను నడిపించలేక మూతవేస్తున్నాయి. ఇప్పటికే ఈనాడు, ఆంధ్ర జ్యోతి వంటి సంస్థలు కోతలు విధించడంతో పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ బాటలో నడిచేందుకు సిద్ధం అయ్యింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణ. మిగతా పత్రికలన్నీ తమకు నిర్వహణ భారం అయ్యిందని, ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయాయి కాబట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతూనే వీలైనంత వరకు కోతలు విధించేశాయి. 


నమస్తే తెలంగాణ కు అంత స్ట్రైట్ గా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే అది అధికార పార్టీకి చెందిన పత్రిక. అదీ కాకుండా మొన్ననే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేటు సంస్థలను ఉద్దేశించి ఉద్యోగుల జీతాల్లో కొత్త విధించవద్దని, ఈ ఆపద సమయంలో ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలం మీదే ఉందని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తీరా ఇప్పుడు సొంత పత్రిక ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడితే పరువు పోతుంది కదా. అయినా ఇది కేసీఆర్ కు అవమానం కదా ! అందుకే జీతాల్లో కోత అనే ఊసు ఎత్తకుండా అడ్జస్ట్మెంట్ అనే పేరు చెప్పి ఇప్పుడు ఉద్యోగస్తుల జీతాల్లో కోతలకు సిద్ధం అయిపోతోంది. '' జీతాల్లో కోతలు లేవు కానీ,సర్దుబాటు ఉంటుంది. కరోనా పీడ కారణంగా మనకూ ఇబ్బందులు తప్పడం లేదు.


 కాబట్టి ఈ నెల జీతంలో కాస్త సర్దుబాటు చేయక తప్పడంలేదు. అది రాబోయే సమీపకాలంలో సర్దుబాటు చేయబడును. మిగతా సంస్థల్లో లా ఇది కోత కాదు గుర్తించండి. ఆందోళన పడకండి. 20 వేలు జీతం లోపు ఉన్నవారికి మొత్తం జీతం, 20 నుంచి 50 వేల మధ్య ఉన్నవారికి 75 శాతం, 50 వేలు దాటితే 60 శాతం అంటూ చావు కబురు చల్లగా చెప్పారట. కాకపోతే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే కరోనా పేరు చెప్పి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించకపోవడమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: